కరీంనగర్‌‌‌‌ను ప్లాస్టిక్‌‌ ఫ్రీ సిటీగా మార్చుకుందాం : మున్సిపల్  కమిషనర్ చాహత్ బాజ్‌‌పాయ్‌‌ 

కరీంనగర్‌‌‌‌ను ప్లాస్టిక్‌‌ ఫ్రీ సిటీగా మార్చుకుందాం : మున్సిపల్  కమిషనర్ చాహత్ బాజ్‌‌పాయ్‌‌ 

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌ను ప్లాస్టిక్‌‌ ఫ్రీ సిటీగా మార్చుకుందామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌‌పాయ్‌‌ అన్నారు. సోమవారం బల్దియా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్​ టీం ఆధ్వర్యంలో టవర్ సర్కిల్‌‌లోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌‌ను పట్టుకుని  రూ.24వేల పెనాల్టీ వేశారు. కమిషనర్‌‌‌‌ మాట్లాడుతూ.. 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్రతి ప్లాస్టిక్ వస్తువు చాలా విషపూరితమైనవని,  వాటిని అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 అంతకుముందు బల్దియాలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌లో మాట్లాడుతూ ఈనెల 12 నుంచి బల్దియా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాశాఖ ఆధ్వర్యంలో 6 నుంచి 18 ఏండ్ల  లోపు విద్యార్థులకు నిర్వహించే క్రీడా శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం  చేసుకోవాలని చెప్పారు. అనంతరం సిటీలో శానిటేషన్‌‌ అమలుపై రివ్యూ చేశారు.