ఎమ్మెల్యే రసమయికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. ఇదేనా ప్రగతి అంటూ నిలదీత

ఎమ్మెల్యే రసమయికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. ఇదేనా ప్రగతి అంటూ నిలదీత

కరీంనగర్ జిల్లా మానుకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గన్నేరువరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుండ్లపల్లి- పొత్తూరు డబుల్ రోడ్డు ఎప్పుడు వేస్తారని ఫ్లెక్సీలలో ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఏమైందని నిలదీశారు. హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చడం లేదంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఫ్లెక్సీల్లో ఏముందంటే..  

కరీంనగర్ జిల్లాలో ఇదేనా ప్రగతి అంటూ ఫ్లేక్సీల్లో నిలదీశారు. 

  • గుండ్లపల్లి- పొత్తూరు డబుల్ రోడ్ పనులు అటకెక్కినట్టేనా?
  • డబుల్ బెడ్రూం ఇళ్ల హామీకి మోక్షం ఎన్నడు?
  • 30 పడకల ఆసుపత్రి హామీ కలేనా?
  • ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాల ఊసేది?
  • నిరుద్యోగ భృతి హామీ నీరు కారినట్టేనా?
  • ఉద్యోగ నియామకాలు ఉత్తదేనా?
  • ఎస్.సీ, బీసీ. కార్పోరేషన్ రుణాల జాడేది?
  • పంట నష్టం పరిహారం పరిహాసమేనా?
  • రుణ మాఫీ హామీకి రుణం తీరిపోయిందా?
  • ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించేదెన్నడు?
  • విద్యుత్, రిజిస్ట్రేషన్, ఆర్.టీ.సీ. ఛార్జీలు పెంచి సామాన్యుని నడ్డి విరువడమేనా మీ ప్రగతి?
  • బీఆర్ఎస్ 2018 ఎన్నికల హామీలన్నీ మాయమాటలేనా?