కరీంనగర్ బస్సుల్లో ప్రయాణించే ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీడ్రా

కరీంనగర్ బస్సుల్లో ప్రయాణించే ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీడ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆర్ఎం రాజు తెలిపారు. ఈనెల 27 నుంచి ఆక్టోబర్ 6వరకు ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించేవారికి ఈ స్కీం అమలు చేస్తున్నట్లు  తెలిపారు.

 గమ్యస్థానం చేరాక తమ టికెట్ వెనుక ప్రయాణికుడి పేరు,  చిరునామా, మొబైల్ నంబర్ రాసి ఉమ్మడి  జిల్లాలోని అన్ని ప్రధాన బస్ స్టేషన్లల్లో అమర్చిన లక్కీడ్రా బాక్సుల్లో వేయాలని సూచించారు.  అక్టోబర్ 8న  డ్రా తీయనున్నట్లు, మొదటి విజేతకు రూ.25వేలు, రెండో  బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేల చెక్కు ఇవ్వనున్నట్లు వివరించారు.