కర్ణాటకలో వివాదం.. బురఖాలు ధరించి డ్యాన్స్ చేసిన విద్యార్థులు

కర్ణాటకలో వివాదం.. బురఖాలు ధరించి డ్యాన్స్ చేసిన విద్యార్థులు

కర్ణాటకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బురఖాలు ధరించి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను.. కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. మంగుళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ ఈవెంట్‭కు సంబంధించి నలుగురు విద్యార్థులు బురఖాలు ధరించి డ్యాన్స్ చేశారు. అయితే వీరి డ్యాన్స్‭కు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కాలేజీ ప్రిన్సిపల్ చర్యలకు ఆదేశించారు. విద్యార్థులను సస్పెండ్ చేసి.. వివరణతో కూడిన సమాధానం ఇవ్వాలని ప్రిన్సిపల్ ఆదేశించారు. 

ఈ వీడియో చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు బురఖాలు ధరించి డ్యాన్స్ చేయడం.. ప్రజల మధ్య మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే కళాశాల యాజమాన్యం ఏం చేస్తోందని మండిపడుతున్నారు.