కర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నరు: సుప్రియా సూలే

కర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నరు: సుప్రియా సూలే

ఢిల్లీ: కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి.. అయినా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఎగదోస్తూ..  ఎందుకు ఘర్షణలకు అవకాశం కల్పిస్తున్నారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు. లోక్ సభలో కర్ణాటక మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం.. జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావించారు. 

కర్ణాటక సీఎం..మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రపై గత 10 రోజులుగా కుట్ర జరగుతోందని  చెప్పారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుండా రెచ్చగొట్టి కొట్లాడుకునేలా చేస్తున్నారని అన్నారు.

మహారాష్ట్రతోపాటు కర్ణాటక  రాష్ట్రాల్లో మీ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా.. ఘర్షణలకు ఎందుకు తావిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని సుప్రియా సూలే డిమాండ్ చేశారు.