
సీబీఐ కొత్త డైరెక్టర్ గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే ఆయనను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేయడం గమనార్హం.
1986 కర్ణాటక బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న శుభోద్ కుమార్ జైశ్వాల్ పదవి కాలం మే 25తో ముగుస్తుంది. అనంతరం ప్రవీణ్ సూద్ కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రవీణ్ సూద్ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మార్చి నెలలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీని అరెస్ట్ చేయాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.