కార్తీకమాసం స్పెషల్: విష్ణుమూర్తికి .. తులసీ మాతకు పెళ్లి.. నవంబర్2న పాటించాల్సిన నియమాలు ఇవే..!

కార్తీకమాసం స్పెషల్: విష్ణుమూర్తికి .. తులసీ మాతకు పెళ్లి.. నవంబర్2న  పాటించాల్సిన నియమాలు ఇవే..!

 కార్తీకమాసానికి ఎంతో విశిష్టత.. ప్రాధాన్యత ఉంది.  ఈ నెలలో అన్ని రోజులు చాలా ప్రాధాన్యత.. ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కార్తీకమాసం శుద్ద ద్వాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు .. తులసీ మాతకు  వివాహం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఈ కార్తీక మాసంలో  శుద్ద ద్వాదశి ( 2025 నవంబర్​ 2) తులసిమాతకు కొన్ని పరిహారాలు చేస్తే పెళ్లిళ్లు తొందరగా అవుతాయని పండితులు చెబుతున్నారు. 

కార్తీక మాసంలో తులసిమాత, శాలిగ్రామం వివాహం చేసుకున్నారని  ఆధ్యాత్మిక గ్రంధాల్లో రుషిపుంగవులు పేర్కొన్నారు. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ద్వాదశి  నాడు తులసి కళ్యాణం  ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు తగిన వరుడు దొరుకుతాడని నమ్ముతారు.

ఈ ఏడాది కార్తీక శుద్ద ద్వాదశి నవంబర్​ 2 వ తేది వచ్చింది. ఈ రోజున తులసి, శ్రీమహావిష్ణువు  శాలిగ్రామ రూపంతో వివాహం చేస్తారు. ఇక అప్పటి నుంచి  దీని తర్వాత నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. వివాహం కాని ఆడపిల్లలచే తులసి కళ్యాణం జరిపిస్తారు. అలా చేయడం వలన అమ్మాయిలకు తగిన వరుడు దొరుకుతాడని స్కంద పురాణంలో ఉంది.

►ALSO READ | నవంబర్ నెల పండుగలు.. ముఖ్యమైనరోజులు ఇవే..!

సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత తులసికోటకు నీటిని సమర్పించండి.  పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించాలి. ఈ పరిహారాన్ని చేస్తే వివాహంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

కార్తీక మాసంలో ద్వాదశి రోజున  తులసి మాతకు ఎర్రచందనం సమర్పించాలని పండితులు చెబుతున్నారు. హిందూమతంలో ఎర్ర చందనాన్ని సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే  ఈ పరిహారాన్ని చేసే వారికి  పెళ్లి త్వరలోనే అవుతుందంటున్నారు పండితులు. ఈ పరిహారంతో వైవాహిక జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

తులసి కళ్యాణం రోజు ( నవంబర్​ 2) పాటించాల్సిన నియమాలు 

  • తులసి వివాహం రోజున తులసి ఆకును శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని, డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.
  • తులసి వివాహం రోజున తులసి మొక్కకు గంగాజలం సమర్పించి సాయంత్రం మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి పూజను విధిగా నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.
  • శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుతో తులసి వివాహం జరిపించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల తల్లి తులసి సాధకుడికి అఖండ అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు.
  • తులసి వివాహం రోజున పూజలో పసుపు, గంధం,  ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల ఇంటికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు.
  • తులసి వివాహ సమయంలో 'ఓం శ్రీకృష్ణాయ నమః..ఓం  గోవిందాయనమః .. ఓం ప్రణత్ కేలాశాయ నమో నమః', 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ...ఓం  గోవిందాయ నమో నమః' అనే మంత్రాన్ని చదువుతూ పూజచేయాలి.
  • తులసి వివాహ రోజున ధార్మిక కార్యక్రమాలు కూడా చేయడం మంచిది. ఈ రోజున బ్రాహ్మణులకు బట్టలు, పండ్లు, మిఠాయిలు కానుకగా ఇవ్వాలి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.
  • తులసి వివాహం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్, పండ్లు సమర్పించాలి. వీటిని విష్ణుమూర్తికి కూడా సమర్పించి పూజ పూర్తయిన తర్వాత వాటిని ప్రసాదంగా పంపిణీ చేయాలి. ఇలా చేయడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.