
కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’. శ్రీదివ్య హీరోయిన్. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
కార్తి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ పర్సనల్‌గా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఇప్పటివరకు అమ్మా నాన్న, బ్రదర్స్ సిస్టర్స్ ఎమోషన్స్‌ని చూశాం కానీ కజిన్స్ ఎమోషన్‌ని చూడలేదు. ఈ చిత్రం చూశాక ప్రతి ఒక్కరూ వాళ్ల కజిన్స్‌కి ఫోన్ చేసి మాట్లాడుతారు. ఫ్యామిలీతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో నాకిది స్పెషల్ ఫిల్మ్’ అని చెప్పాడు. నా ఫేవరెట్ యాక్టర్ కార్తితో వర్క్ చేయడం హ్యాపీ అంది శ్రీదివ్య. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రేమ్ కుమార్, నిర్మాతలు సురేష్ బాబు, సునీల్ నారంగ్ తెలియజేశారు.