మాస్‌‌, హ్యూమర్ ఉన్న క్యారెక్టర్ జపాన్‌ : కార్తీ

మాస్‌‌, హ్యూమర్ ఉన్న క్యారెక్టర్ జపాన్‌ : కార్తీ

‘‘ఇది నా 25వ సినిమా. ట్రూ స్టోరీ కాదు.. కానీ రియల్ ఇన్సిడెంట్స్‌‌కు దగ్గరగా ఉంటుంది. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే  అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ అనిపించింది. రాజు మురుగన్ జర్నలిస్ట్‌‌ నుంచి డైరెక్టర్ అయ్యారు. ఆయన చూసిన అనుభవాలు ఇందులో ఉన్నాయి. ప్రతి సీన్ ఒరిజినల్‌‌గా ఉంటుంది. ఆయనలో చాలా హ్యూమర్ కూడా ఉంది.  ఫన్ ఎలిమెంట్స్‌‌తో నేటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండే  ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది.  

చాలా రోజుల తర్వాత మాస్‌‌తో పాటు హ్యూమర్ సెటైర్ ఉన్న డిఫరెంట్ రోల్ చేశాను. ఈ పాత్ర చాలా యూనిక్‌‌గా ఉంటుంది. దీనికోసం నన్ను నేను మార్చుకున్నా. డబ్బింగ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నా. కంప్లీట్‌‌గా కొత్త కార్తి కనిపిస్తాడు.  

యూనివర్సల్ ఆడియన్స్‌‌  కోసం టాలెంటెడ్ టెక్నీషియన్స్‌‌తో వర్క్ చేశాం. జీవీ ప్రకాష్ మ్యూజిక్‌‌తో మరో స్థాయికి తీసుకెళ్ళారు. జపాన్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తేనే అర్ధమౌతుంది. ప్రేక్షకులకు మాత్రం కొత్త ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఇస్తుంది. ఇక ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌‌పై ఉన్నాయి. అలాగే ఖైదీ2, సర్దార్ 2 కూడా ప్లానింగ్‌‌లో ఉన్నాయి’’.