టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణం

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణం

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రాష్ట్రంలో పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో టీడీపీ బలం పెరుగుతుందన్నారు. గ్రామగ్రామం, మండలాల వారీగా టీటీపీ కార్యకర్తలు, యువకులను తట్టి లేపుతామన్నారు. సూర్య, చంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు. సబ్బండ వర్గాలు తెలుగుదేశం వైపు చూస్తున్నాయని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. 

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి.. తర్వాత గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లారు. గన్ పార్క్ దగ్గర అమర వీరుల స్థూపానికి కాకాని నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీలోకి రాకముందు కాసాని 2018లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‭గా కూడా ఆయన పనిచేశారు.