నిజామాబాద్ జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం

నిజామాబాద్ జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ గా రూరల్​ సెగ్మెంట్​కు చెందిన కాట్​పల్లి నగేశ్​రెడ్డి  నియామకమయ్యారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేసిన ఆయనకు హైకమాండ్​ జిల్లా బాధ్యతలు అప్పగించింది. డీసీసీ పోస్టుకు15 మంది పోటీపడగా పలు అంశాల ప్రతిపాదికన నగేశ్​రెడ్డికి అవకాశం దక్కింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూరల్ సెగ్మెంట్​ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.

 కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో నామినేటెడ్​పోస్టుపై అశలు పెట్టుకున్నారు.  ఆయనకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్​, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి పూర్తి మద్దతు లభించడంతో సక్సెస్ అయ్యారు. డిచ్​పల్లి మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన కాట్​పల్లి నగేశ్​రెడ్డి యూత్​ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 

మొదట సర్పంచ్​గా, మోపాల్​ సింగిల్​ విండో చైర్మన్​గా పని చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీకి పదేండ్లు చైర్మన్​గా 2014 వరకు కొనసాగారు. పీసీసీ సెక్రటరీగా వ్యవహరించి జనరల్ సెక్రటరీగా ఎదిగి ఇప్పుడు  కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు.  

కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్​గా మల్లికార్జున్​

కామారెడ్డి: కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్​గా మల్లికార్జున్​ను ఏఐసీసీ నియమించింది. డీసీసీ ప్రెసిడెంట్ల నియమాకం కోసం  ఏఐసీసీ నియమించిన పరిశీలకులు అక్టోబర్ లో జిల్లాలో పర్యటించారు.  నియోజకవర్గాల వారీగా  మీటింగ్​లు నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించారు.  డీసీసీకి 30 మంది లీడర్లు అప్లయ్ చేసుకున్నారు.   జుక్కల్​ నియోజకవర్గంలోని నిజాంసాగర్​ మండలానికి చెందిన మల్లికార్జున్​ను  ఏఐసీసీ నియమించింది.