కావేరీ సీడ్స్​ కు నాలుగో క్వార్టర్ లో రూ. 60.64 కోట్ల ఆదాయం

 కావేరీ సీడ్స్​ కు నాలుగో క్వార్టర్ లో రూ.  60.64 కోట్ల ఆదాయం

హైదరాబాద్​, వెలుగు: నగరానికి చెందిన విత్తనాల తయారీ కంపెనీ కావేరీ సీడ్స్​ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో రూ.  60.64 కోట్ల ఆదాయం సాధించింది.  అంతకుముందు ఏడాది నాలుగో క్వార్టర్​లో వచ్చిన రూ.54.56 కోట్లతో పోలిస్తే ఇది 11.14శాతం ఎక్కువ. ఇబిటా రూ. 6.73 కోట్లు వచ్చింది. నికర లాభం రూ. 13.89 కోట్లని కంపెనీ ప్రకటించింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 915.00 కోట్ల నుంచి  రూ. 1000.56 కోట్లకు పెరిగింది.

ఇబిటా రూ. 238.41 కోట్ల నుంచి రూ. 296.94 కోట్లకు ఎగిసింది.  నికరలాభం రూ. 208.90 కోట్ల నుంచి రూ. 267.04 కోట్లకు చేరింది. పత్తి పరిమాణం 7.01శాతం పెరిగింది. దీని నుంచి వచ్చే ఆదాయం 2.87శాతం పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో  హైబ్రిడ్ బియ్యం వాల్యూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 12.33శాతం పెరిగాయి. బియ్యం వాల్యూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 6.18శాతం పెరిగాయి. కూరగాయల విత్తనాల అమ్మకాలు నిలకడగా ఉన్నాయి.  ఆదాయం 3.76శాతం పెరిగింది.