కవిత కులాహంకారంతో మాట్లాడుతోంది : ఎంపీ అర్వింద్

కవిత కులాహంకారంతో మాట్లాడుతోంది : ఎంపీ అర్వింద్

ఎమ్మెల్సీ కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులాహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. తన ఇంట్లో విధ్వంసం సృష్టించి 70 ఏండ్ల తల్లిని బెదిరించి ఇతర మహిళలను కొట్టే హక్కు ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కవిత ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఇది దొరల పాలన కాదని అన్నారు. 

రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారని, దాన్ని తాను అర్థంచేసుకుంటానని అన్నారు. తనపై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్న ఆమె ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కవిత తన అభ్యర్థనను మన్నించడం ఎంతో సంతోషంగా ఉందన్న అర్వింద్.. ఇప్పటికైనా ఆమె మాటపై నిలబడాలని ఆకాంక్షించారు. 2024 లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.
ఏక్నాథ్ షిండే అయ్యేంత సీన్ ఎమ్మెల్సీ కవితకు లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్ తన బిడ్డ కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని అన్నారు. తన బిడ్డకు బీజేపోళ్లు ఫోన్ చేసిండని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ వాళ్లు కూడా టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు.

రైతులను మోసగించేందుకు కేసు ఎదుర్కోవాలన్న  కవిత వ్యాఖ్యలపై అర్వింద్ స్పందించారు. ఏ కోర్టులో కేసు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. గత ఎన్నికల్లో నామినేషన్ వేసిన 178 మంది పసుపు రైతుల్లో 71 మంది బీజేపీలో చేరిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. నీ మేనిఫెస్టోలు మొత్తం చీటింగేనన్న అర్వింద్... రైతులు గుంపుగుంపులుగా వచ్చి బీజేపీలో వచ్చి చేరుతుంటే తన మీద ఏం చీటింగ్ కేసు వేస్తావని ప్రశ్నించారు. ఆమె చెప్పిన స్టేట్ మెంట్ కు అంగీకరిస్తున్నాని, వచ్చి పోటీ చేయమని సవాల్ విసిరారు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాన్న అర్వింద్.. 2024వరకు కూడా వెయిట్ చేయలేనని చెప్పారు. ఇది కేవలం కుల అహంకారమేనన్న ఆయన.. తెలంగాణలో కుల అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు.