The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్ ఫిక్స్.. జడల్ లవర్‌గా సెన్షనల్ బ్యూటీ ఎంట్రీ

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్ ఫిక్స్.. జడల్ లవర్‌గా సెన్షనల్ బ్యూటీ ఎంట్రీ

నేచురల్ స్టార్ నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ పీరియాడిక్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్, పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, ఆయా షేర్ సాంగ్.. ఇలా అన్నీ కలిసి సినిమాపై భారీ హైప్‌ను పెంచాయి.

ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే రగ్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. మీసం, గెడ్డం, రెండు జడలు, కూలింగ్ గ్లాసెస్‌తో నాని లుక్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. నానితో పాటుగా కీలక పాత్రల్లో మోహన్ బాబు ‘శికంజ మాలిక్’గా, సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జయల్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

అయితే, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్‌తో సినిమా మీద క్యూరియాసిటీ పెరిగినా, ‘జడల్’ లవర్ ఎవరన్నది మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రహస్యంగానే ఉంచుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నాని సరసన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్‌గా సెన్షేషనల్ బ్యూటీ కయదు లోహర్ (Kayadu Lohar) నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఏప్రిల్ 11న కయాదు లోహర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో 'సుబ్బు' పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. మాలిక్ ప్రపంచానికి చెందిన యువతిగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకటనతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

కయాదు లోహర్ సినిమాలు:

‘డ్రాగన్’ సినిమాతో యూత్ ఆడియన్స్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కయాదు లోహర్. అంతకుముందు శ్రీ విష్ణు 'అల్లూరి'లోనూ మెరిసింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇపుడు ప్యారడైజ్ తో పాటలుగా మలయాళంలో పళ్ళి చట్టంబిలో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ హీరో శింబుకు జంటగా ఓ చిత్రంలో, అధర్వ, జీవీ ప్రకాష్ కుమార్ వంటి యంగ్ హీరోల సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్.

ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో ఫుల్ బిజీ అవుతోంది కయాదు లోహర్. మరోవైపు ఆడియన్స్లో ఆమెకున్న హాట్ ఇమేజ్కి తెలుగులో ఎలా లేదన్నా ఒక ఐదారు సినిమాలు వెంట వెంటనే పడేలా ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.