కయాకింగ్కు కేరాఫ్ అడ్రస్ కోటిపల్లి రిజర్వాయర్.. వెళ్లొద్దామా..

కయాకింగ్కు కేరాఫ్ అడ్రస్ కోటిపల్లి రిజర్వాయర్.. వెళ్లొద్దామా..

కనుచూపు మేర పచ్చదనం, దారి పొడవునా ఎత్తైన కొండలు ఉన్న ప్లేస్ అంటే ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లకు చాలా ఇష్టం. అందుకే వీకెండ్ లో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకు చాలా మంది ఇలాంటి ప్లేస్ కి వెళ్తుంటారు. టూరిస్ట్ లు మళ్లీ మళ్లీ చూసి రావాలి అనుకునే ప్లేస్ లో కోటిపల్లి రిజర్వాయర్ ఒకటి. వికారాబాద్ జిల్లాలోని దారూర్ ఊర్లో ఉంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఫేమస్.

ఒకప్పుడు ఇదొక మామూలు రిజర్వాయర్. టూరిస్టల్ని అట్రాక్ట్ చేయడం తో పాటు అక్కడివాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఇక్కడ 2015లో వాటర్ స్పోర్ట్స్ (కాయకింగ్) మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ ప్లేస్టూరిస్ట్ లకి బెస్ట్ ఛాయిస్ అయింది. ఇక్కడ 30 నిమిషాలు కాయకింగ్ చేయడానికి ఒక్కరికి 200, ఇద్దరికి రూ. 300 ఖర్చవుతుంది. లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ గార్డ్స్ కూడా వెంటే ఉంటారు. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు నేచర్ లవర్స్, ఫొటోగ్రాఫర్స్ ఎక్కువగా వస్తుంటారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేసి, రిలాక్స్ అయ్యేందుకు కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్తుంటారు చాలామంది. కోటిపల్లి దారి పొడవునా పక్షుల్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ లో ఈ ప్రాంతం టూరిస్ట్లతో నిండిపోతుంది. ఫుడ్, ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ.

ఇలా వెళ్లాలి

అనంతగిరి హిల్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కోటిపల్లి రిజర్వాయర్. వికారాబాద్ నుంచి 30 కిలోమీటర్లు, హైదరా బాద్ నుంచి 110 కిలోమీటర్ల జర్నీ. కారు లేదా బైక్ మీద వెళ్లొచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పర్మిషన్ ఉంటుంది.


ట్రెక్కింగ్ కి పాపులర్..

వీకెండ్ లో లాంగ్ డ్రైవ్క వెళ్లాలి అనుకునేవాళ్లకి అనంతగిరి హిల్స్ బెస్ట్ ఛాయిస్. తెలంగాణలో దట్టమైన అడవి. ఉన్న ప్లేస్లో ఇదొకటి. మూసీ నది పుట్టింది ఇక్కడే. అంతేకాదు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకి నీళ్లు వచ్చేది అనంతగిరి నుంచే. ఇక్కడికి వెళ్లే దారంతా... ఎత్తైన కొండలు, పెద్దపెద్ద చెట్లు, మలుపుల రోడ్డుతో కొత్త ఫీలింగ్ని ఇస్తుంది. వ్యూ పాయింట్స్ నుంచి చూస్తే అనంతగిరి మొత్తం కనిపిస్తుంది. వీకెండ్స్ లో చాలామంది ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుంటారు. కొండ మీద అంతగిరి టెంపుల్ ఉంటుంది. శ్రీ మహా విష్ణువు అనంతపద్మనాభ స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ. రోజంతా ఉండాలి అనుకునే వాళ్లు ఇక్కడి హరిత రిసార్టులో బస చేయొచ్చు. రోజుకి రూ.1500 కట్టాలి.

ఇలా వెళ్లాలి

వికారాబాద్ నుంచి ఆరున్నర కిలోమీటర్ల జర్నీ చేస్తే అనంతగిరి కొండల దగ్గరికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు జర్నీ.