
కాజీపేట, వెలుగు : సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్ కాజీపేట రైల్వే స్టేషన్ ను బుధవారం తనిఖీలు చేశారు. అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల గురించి రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాజీపేట డీజిల్ కాలనీలోని డీజిల్ లోకోషెడ్, ఎలక్ర్టిక్ లోకో షెడ్లను తనిఖీ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అమృత్ భారత్ రైల్వే డెవలప్ మెంట్ వర్క్స్ పరిశీలించారు. కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలు వినతులను ఇవ్వగా.. పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.