
- గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యం గా ఆయన రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. పార్టీ ప్రచార తీరు, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గేల రాష్ట్ర టూర్ లపై చర్చిస్తారు.
పెండింగ్లో ఉన్న మిగిలిన మూడు సీట్లపై కూడా ఆయన స్టేట్ లీడర్లతో చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనున్నది. అయితే, ఈ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ టికెట్ల అంశంపై చర్చ లేదని, అందుకే సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీ వెళ్లడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.