ప్రధాని మోదీ టూర్​కు కేసీఆర్ ​దూరం

ప్రధాని మోదీ టూర్​కు కేసీఆర్ ​దూరం

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్​మరోసారి దూరంగా ఉండనున్నారు. కరోనా ఫస్ట్​వేవ్​తర్వాత ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కేసీఆర్​ఆయనకు స్వాగతం పలకడం లేదు. ఈసారి కూడా అదే విధంగా దూరంగా ఉంటున్నారు.

ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​స్వాగతం పలకనున్నారు. ప్రధాని అక్కడి నుంచి మహబూబ్​నగర్​జిల్లా పర్యటనకు వెళ్తారు. కాగా, సీఎం వైరల్​ఫీవర్​తో బాధపడుతున్నారని కొన్ని రోజుల కింద మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.