ఎఫ్​ఆర్వో హత్యకు కేసీఆర్‌దే బాధ్యత : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

ఎఫ్​ఆర్వో హత్యకు కేసీఆర్‌దే బాధ్యత : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హ త్యకు కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, ఇది ప్రభుత్వ హత్య అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎఫ్ఆర్వో హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్కారు నిర్లక్ష్యంతోనే అధికారులపై దా డులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోడు భూ ములకు పట్టాలిస్తామని మాటిచ్చి 2014 నుంచి మోసం చేస్తున్నారని, తాజాగా మళ్లీ సర్వే పేరుతో ఆదివాసీలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న వారి భూములను సర్వే చేయడం లేదన్నారు. 

ప్రజలకు, అధికారులకు మధ్య గొడవలు పెట్టి ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాతో  పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని ప్రశ్నించారు. పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుధవారం హైదరాబాద్ లోని బీఎస్పీ కార్యాలయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 55వ పుట్టిన రోజు సందర్భంగా 55 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం mybsp.in పేరుతో సిటిజన్ ఎంగేజ్ మెంట్ పోర్టల్ ప్రారంభించారు. ప్రజా సమస్యలను ఈ పోర్టల్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.