కాళేశ్వరం ఆషామాషీగా కట్టలే

కాళేశ్వరం ఆషామాషీగా కట్టలే

కాళేశ్వరం ఆషామాషీగా కట్టలే
దానివల్ల నిజాంసాగర్​ ఎప్పుడూ నిండే ఉంటది: కేసీఆర్​

కామారెడ్డి , వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టును ఆషామాషీగా.. తమాషా కు.. జోకుల కోసం కట్టలేదని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరంతో నిజాంసాగర్​ ప్రాజెక్టు ఎప్పటికీ నిండే ఉంటదని.. అది ఎండిపోయే ప్రశ్నే రాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి  మల్లన్నసాగర్​ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టును నింపుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం  తిమ్మాపూర్​లో జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్​ దంపతులు పా ల్గొన్నారు.  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి దంపతులతో కలిసి  స్వామివారికి పూజలు చేశారు.  దాతల సహకారంతో తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని  స్వామి వారికి సమర్పిం చారు.  తర్వాత ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో  కేసీఆర్​ మాట్లాడారు.  తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు మంజీరా నది మీద  దేవులా దగ్గర  50 టీఎంసీల కెపాసిటీతో ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నారని.. కానీ ఏపీ ఏర్పడిన తర్వాత దాన్ని పక్కన  పెట్టి,   కెపాసిటీని 30 టీఎంసీలకు తగ్గించి సింగూరు వద్ద ప్రాజెక్టును నిర్మించారన్నారు. తెలంగాణలోని పంటలను ఎండబెట్టి.. సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్​కు మంచినీళ్లు తరలించుకు వెళ్లారన్నారు. నిజాంసాగర్​ ప్రాజెక్టుకు నీళ్లు రాక పంటలు ఎండిపోతుంటే  నిజామాబాద్​ కలెక్టరేట్​ ఎదుట   పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో అప్పట్లో  వారం పాటు దీక్షలు చేశారని, తాను కూడా వచ్చి పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు.  

జీవోను గంటలోనే ఇచ్చారు :  స్పీకర్​ పోచారం

కేసీఆర్​తోనే దేశం మొత్తం బాగు పడ్తదని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. సొల్లు కబుర్లు   చెప్పేవాళ్లు  మైక్​లు పట్టుకుని  స్పీచులు దంచుతారని, వారితో  డెవలప్​మెంట్​ కాదన్నారు. దేశ మంతా ఇప్పుడు  కేసీఆర్ ​కోసం ఎదురు చూస్తున్నదన్నారు. తిమ్మాపూర్​ టెంపుల్​కు 67 ఎకరాల జీవోను  కేసీఆర్ గంటలోనే  ఇచ్చారన్నారు.   గతంలో జీవో రావాలంటే రోజులు గడిచిపోయేవని గుర్తు చేశారు. ప్రోగ్రాంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి,  ఎంపీలు బీబీపాటిల్​,  సురేశ్​​రెడ్డి, విప్​ గంప గోవర్ధన్​, ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ తదితరులు పాల్గొన్నారు.  

నేను ఉన్నన్ని రోజులు మీరు సభలో ఉండాల్సిందే...!

‘‘ వయస్సు మీద పడుతుందని  అనుకోవద్దు. నేను ఉన్నన్ని రోజులు మీరు కూడా సభలో ఉండాల్సిందే”అని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డిని ఉద్దేశించి  కేసీఆర్​ అన్నారు.   ‘నాకు కూడా 69 ఏండ్లు వచ్చాయి. ఫిజికల్​గా కొంత ఇబ్బంది ఉన్నా..  మీరు ధైర్య వంతులు.  బాన్స్​వాడ ప్రజలకు ఇంకా సేవా చేయాలి.  మిమ్మల్ని వదులుకునే ప్రశ్నే లేదు’ అని పేర్కొన్నారు.   బాన్స్​వాడ మెటర్నిటీ హాస్పిటల్​కు దేశంలోనే  గుర్తింపు వచ్చిందన్నారు.  దేవునికి సేవ చేసే అదృష్టాన్ని  స్పీకర్​ తనకు కల్పించారని,  కల్యాణంలో పాల్గొనటం  అదృష్టంగా భావిస్తున్నానన్నారు.    టెంపుల్​కు రూ. 7 కోట్లు,   బాన్స్​వాడ నియోజకవర్గానికి ఎస్​డీఎఫ్​ నుంచి  రూ.50 కోట్ల ఫండ్స్​ మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.