నాలాంటోళ్లను తెచ్చి సిద్దిపేటను చూపించాలె: హీరో నాని

నాలాంటోళ్లను తెచ్చి సిద్దిపేటను చూపించాలె: హీరో నాని

సిద్ధిపేటను చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందని సినీ నటుడు నాని అన్నారు. మంత్రి హరీష్ రావుతో కలిసి నడుస్తుంటే కుటుంబ పెద్దతో కలిసి వస్తున్నట్లు ఉందని చెప్పారు. తనలాంటి వాళ్లను తీసుకువచ్చి సిద్దిపేట చూపించాలన్నారు. జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు హీరో నాని, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. 

దేశ జనాభాలో తెలుగువాడైన అంబటి రాయుడు క్రికెట్ ఆడటం గొప్ప విషయమని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర యువత అన్ని రంగాల్లో అల్ రౌండర్‭గా రాణించాలని చెప్పారు. రానున్న రోజుల్లో మంచి క్రికెటర్ కోచ్‭లను తీసుకువచ్చి వజ్రాల లాంటి క్రీడాకారులను తయారు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ తరహా దేశమంతా అభివృద్ధి జరగాలని ఆ దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మంత్రి హరీష్ పేర్కొన్నారు.