కేసీఆర్​ అవినీతి పాలనే మా ప్రచార అస్త్రం : మురళీధర్ రావు

కేసీఆర్​ అవినీతి పాలనే మా ప్రచార అస్త్రం : మురళీధర్ రావు

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ అవినీతి పాలనే ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్​చార్జ్​ మురళీధర్ రావు స్పష్టం  చేశారు. తెలంగాణలో ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నదని ఆయన అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నీ కుటుంబ పార్టీలేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్మరన్నారు.