అభినవ సతీ సావిత్రిగా కీర్తి సురేష్.. ఈసారి లాయర్ పాత్రలో

అభినవ సతీ సావిత్రిగా కీర్తి సురేష్.. ఈసారి లాయర్ పాత్రలో

‘మహానటి’ చిత్రంలో అలనాటి నటి సావిత్రిగా మెప్పించిన  కీర్తి సురేష్‌‌‌‌... త్వరలో లాయర్ సావిత్రిగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఆమె లీడ్ రోల్‌‌‌‌లో ప్రవీణ్‌‌‌‌ ఎస్‌‌‌‌ విజయ్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రానికి ‘సత్యవన్‌‌‌‌ సావిత్రి’ అనే టైటిల్‌‌‌‌ను ఖరారు చేశారు.  ఇదొక కోర్ట్ రూమ్ థ్రిల్లర్.  గురువారం ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి టైటిల్‌‌‌‌ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు. 

చుట్టూ లాయర్ల మధ్య కీర్తి సురేష్ కనిపిస్తున్న ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది.  డ్రమ్ స్టిక్ ప్రొడక్షన్స్‌‌‌‌, జీ స్టూడియోస్‌‌‌‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమిళ దర్శకుడు మిస్కిన్‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.  ‘హార్ట్‌‌‌‌బీట్’ సిరీస్ ఫేమ్ చారుకేష్‌‌‌‌, బాలాశ‌‌‌‌ర‌‌‌‌వ‌‌‌‌ణ‌‌‌‌న్‌‌‌‌, శిల్పా మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సామ్‌‌‌‌ సీఎస్‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. 

ఈ ఏడాదే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భర్త ప్రాణాలను కాపాడటం కోసం యముడితో పోరాడిన స‌‌‌‌తీసావిత్రి పాత్రను ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా సోషలైజ్‌‌‌‌ చేసి ఈ కోర్ట్‌‌‌‌ రూమ్ డ్రామాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్ధన్‌‌‌‌’, మలయాళంలో ‘తోట్టం’ సినిమాలు చేస్తోంది.  రాజ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రావ్‌‌‌‌కు జంటగా ఆమె నటిస్తున్న హిందీ చిత్రం ‘రఫ్తార్‌‌‌‌‌‌‌‌’ జులై 24న విడుదల కానుంది.