తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. తాము 20 ఏండ్ల నుండి ఆశ వర్కర్లుగా పని చేస్తున్నామని..18 వేల ఫిక్డ్స్ జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలి అని కోరారు. చేనేత యూనిఫామ్స్ ఇస్తా అంటున్నారు కానీ, తమకు ఇచ్చే యూనిఫామ్స్ నాణ్యతమైనది కాదని.. ఇకనైనా నాణ్యమైనది కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. 

తాము 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనుంచి అయినా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కలసి పలు మీటింగ్స్ లో తమ గోడును చెప్పుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డ పని చేసిన తమకు ఇప్పటివరకు న్యాయం చేయకపోవడం చాలా బాధాకరమైన గుర్తు చేశారు.  దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అంటున్నారు కానీ.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన, ఆశా వర్కర్లకు నాణ్యమైన చీరలు, మంచి జీతాలు ఇస్తున్నారని చెప్పారు.