వర్క్ ఫ్రమ్ జైల్: మంత్రికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ

వర్క్ ఫ్రమ్ జైల్: మంత్రికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ

ఢిల్లీలో నీటి సమస్యలను పరిష్కరించమని ఆప్ మంత్రి అతిషీని సీఎ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఆదేశించారు. ఇటీవల లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసి సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు వారం రోజుల పాటు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగించింది.  దీంతో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తున్నారు.

ఆదివారం ఢిల్లీ వాటర్ ప్రాబ్లమ్స్ పై లేఖ ద్వారా మంత్రి అతిషీకి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. "ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీళ్ల సమస్యలు ఉన్నాయి. సమ్మర్ కూడా వచ్చింది..  నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడొద్దు. అవసరమైతే.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ సహాయం తీసుకోండి.. ఆయన తప్పకుండా సహకరిస్తారు" అని లేఖలో కేజ్రీవాల్ తెలిపారు.

 సీఎం కేజ్రీవాల్ నుంచి వచ్చిన లేఖ చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయన్నారు మంత్రి అతిషీ. "ఆయన జైలులో ఉన్నా.. ఢిల్లీ ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నారు. రెండు కోట్ల ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ తన సొంత కుటుంబంగా భావిస్తారు. ఈడీ ఆయనను అరెస్టు చేయోచ్చు కానీ.. ఆయన పనిని కాదు" అని ఆమె అన్నారు.