ఈ పాకిస్థానీల ధైర్యం ఏంటి: అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

ఈ పాకిస్థానీల ధైర్యం ఏంటి: అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర పాక్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని హిందూ, సిక్కు శరణార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సిఎఎపై ఇండియా కూటమి నాయకులు చేసిన ప్రకటనలపై పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు శుక్రవారం పార్టీ కార్యాలయాల దగ్గర నిరసన చేపట్టారు. వారి మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

ఈ విషయంపై కేజ్రీవాల్ అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో స్పందించారు. ఈ పాకిస్థానీల ధైర్యం ఏంటి? ఫస్ట్ వారు మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డి మన దేశ చట్టాలను ఉల్లంఘించారని అన్నారు. అందుకు జైలులో ఉండాలి. కానీ ఇలా దేశంలో నిరసనలు, ఆందోళనలు సృష్టించేంత ధైర్యం వారికి ఉందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు ? CAA తరువాత.. పాక్, బంగ్లా వలసవాదులు దేశమంతటా చేరి ప్రజలను వేధిస్తారని ఆయన అన్నారు. వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే స్వార్థ ప్రయోజనాల కోసం, బిజెపి మొత్తం దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించారు.