ఫుడ్ ఇవ్వ‌డానికి వ‌చ్చిన పోలీసులు.. దూరంగా ఉండాల‌న్న బిచ్చ‌గాడు

ఫుడ్ ఇవ్వ‌డానికి వ‌చ్చిన పోలీసులు.. దూరంగా ఉండాల‌న్న బిచ్చ‌గాడు

క‌రోనా వైర‌స్ నియంత్రించేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ సోష‌ల్ డిస్టాన్స్ పాటించాల‌ని, వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండాలంటే అది ఒక్క‌టే స‌రైన మార్గ‌మ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌తి సంద‌ర్భంలో చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం లాక్ డౌన్ నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ రోడ్ల‌పై గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కానీ కేర‌ళ‌లోని ఓ బిచ్చ‌గాడు మాత్రం త‌నకు ఆహారాన్ని అందించేందుకు వ‌చ్చిన పోలీసుల‌కు కూడా తాను సామాజిక దూరం పాటిస్తున్న‌ట్టు చెబుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న యాచ‌కుల‌కు పోలీసులు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఆ స‌మ‌యంలో రోడ్డుపక్క తలదాచుకుంటున్న ఓ బిచ్చ‌గాణ్ని చూసిన పోలీసులు అతని ఆకలి తీర్చడానికి ఆహారాన్ని తీసుకొచ్చారు. వారిని చూసిన బిచ్చగాడు.. దూరం దూరం.. అంటూ కేకేలేసి , ప‌క్క‌న ఉన్న ఓ సుద్దముక్కతో స‌ర్కిల్ గీసి అందులో ఆ ఆహార పొట్లాన్ని ఉంచాల‌ని చెప్పాడు. పోలీసులు కూడా అత‌ని సామాజిక బాధ్య‌త‌ను అర్ధం చేసుకొని, అతని ఆదేశాన్ని పాటించి వెళ్లిపోయారు. ఏప్రిల్ 8న ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బిచ్చగాడు తన ద్వారా మరొకరికి ఏ ముప్పూ రాకూదడని నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని పడుకోవడం మరో విశేషం.