ఆ నలుగురే తెలంగాణను పాలిస్తున్నరు

ఆ నలుగురే తెలంగాణను పాలిస్తున్నరు
  • ఆ నలుగురే తెలంగాణను పాలిస్తున్నరు
  • దేశానికి కేరళ మోడల్​ ఆదర్శం
  • సీపీఎం పొలిట్​బ్యూరో మెంబర్ ​విజయరాఘవన్


భద్రాచలం,వెలుగు: విద్య, వైద్యం, సంక్షేమంపై దృష్టిసారించి పాలన అందిస్తున్న కేరళ మోడల్​ దేశానికి ఆదర్శమని, దేశానికి ఇప్పుడు అలాంటి పాలనే కావాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయరాఘవన్​ అన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు వెంకట్​తో కలిసి సోమవారం భద్రాచలంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి కారం పుల్లయ్యను గెలిపించాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్​, కవిత, హరీశ్​రావు...ఆ నలుగురే తెలంగాణను పాలిస్తున్నారని విమర్శించారు. 

భద్రాచలానికి తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ఎస్​, బీజేపీకు ఓట్లు అడిగే హక్కులేదన్నారు. ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలోకి తెచ్చే దమ్ము బీఆర్ఎస్​కు లేదా అని ప్రశ్నించారు. కేటీఆర్​ భద్రాచలం పర్యటనలో భద్రాచలం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. నవంబరు 25న త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాణిక్​సర్కార్..​వాజేడు మండలం, భద్రాచలంలో పర్యటిస్తారని, 27న మాజీ రాజ్యసభ మెంబర్​బృందాకారత్​ ప్రచారంలో పాల్గొంటారన్నారు. మచ్చా వెంకటేశ్వర్లు, రమేశ్, బాలనర్సారెడ్డి, మర్లపాటి రేణుక, సున్నం గంగా, బండారు శరత్​బాబు, గడ్డం స్వామి పాల్గొన్నారు.