కుట్టియత్తూర్ మామిడికి మంచిరోజులు వచ్చాయ్.. దక్కిన అరుదైన గౌరవం.. వివరాలు ఇవిగో.!

కుట్టియత్తూర్  మామిడికి మంచిరోజులు వచ్చాయ్.. దక్కిన అరుదైన గౌరవం.. వివరాలు ఇవిగో.!


కేరళలోని కుట్టియత్తూర్ మామిడికి  మంచి రోజులు వచ్చాయి. . యస్.. ప్రపంచ వ్యాప్తంగా జియో గ్రాఫికల్ ఇండికేషన్‌ ట్యాగ్‌తో గుర్తింపు పొందిన జాబితాలో కుట్టియత్తూర్ మామిడిపండు చేరింది. 

కేరళ వ్యాప్తంగా కన్నూర్ జిల్లాలోని  కుట్టియత్తూర్  మామిడి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. జీఐ ట్యాగ్‌ కేటాయింపుతో మామిడి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నేలల్లో పోషకాలతో ప్రత్యేక రుచిని సంతరించుకున్న కుట్టియత్తూర్  మామిడి.. రానున్న రోజుల్లో దిగుబడి అంతకుమించి అనేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతులు నంబియార్ మామిడి, కన్నాపురం మామిడి, కుంజిమంగళం మామిడి,  వడకుంభాగం మామిడి, కుట్టియత్తూర్ మామిడి  వంటి వివిధ రకాల మామిడి పండ్లను సాగు చేస్తారు. 

అయితే రాజుల కాలంలో  పురుడుపోసుకున్న కుట్టియత్తూర్  మామిడి.. రుచిలో రా రాజుగా కేరళలోని  కన్నూర్ జిల్లాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. 120 ఏళ్ల క్రితం రాజుల పాలనలోనే  ఈ మామిడి తోటలను ప్రారంభించారు. ఇక్కడి వాతావరణం, నేలలు అనుకూలించి మామిడి పండ్ల సైజు, రుచి చాలా ప్రసిద్ది చెందాయి. కుట్టియత్తూర్  నేలల్లో టోటల్‌ సాల్యుబుల్‌ సాలిడ్స్‌ అధికంగా ఉండటంతో మామిడి పంటకు ప్రత్యేకత ఏర్పడింది. పండులోని కండ మెత్తగా ఉండటం, పీచులేకపోవడం, ఎక్కువగా మచ్చలు లేకపోవడం, తీయగా.. రుచికరంగా  ఉండటంతో ఈ మామిడి తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.

మధుర ఫలం మామిడి తీపిలో ఎలాంటి తేడా లేకుండాకుట్టియత్తూర్  మామిడి గుర్తింపు పొందింది. జీఐ సూచికతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో కుట్టియత్తూర్ మామిడి అమ్మకాలు జోరందుకోనున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌తో కుట్టియత్తూర్ మామిడి పండ్లు మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. రుచిలో అమృతం, రూపంలో బంగారు వర్ణంతో పోటీ పడే ఈ మామిడి పండ్లు ప్రజలకు ఎండాకాలంలో తీపిని పంచుతాయి. కేరళలోని కన్నూర్ జిల్లాతో పాటు   రాష్ట్రం, దేశ సరిహద్దులుదాటి అంతర్జాతీయ స్థాయిలో కుట్టియత్తూర్  మామిడి ఆదరణ పొందింది

 కుట్టియత్తూర్  లో సాగైన మామిడి దేశవిదేశీ మార్కెట్లలో సందడి చేస్తుంది.  కుట్టియత్తూర్  మామిడిపండు ఒక్కటి  వంద రూపాయల వరకు పలుకుతుంది. చాలా మంది వ్యాపారులు తోటల దగ్గరికే వెళ్లి పండ్లను తీసుకెళ్తారు. ఇలా ప్రజల ఆదరణ ఉన్న ఈ మామిడిని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం సబ్సిడీలు సైతం ఇస్తోంది. ఉద్యానవన శాఖలో రైతులకు తోటల పెంపకంతోపాటు మామిడి దిగుబడి వచ్చాక విక్రయించేందుకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొనుగోళ్లను కూడా చేపడుతోంది. దీంతో రైతులు మామిడి పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.