
వయసుతో సంబంధం లేకుండా మనుషులు పిట్టల్లా రాలిపోతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సరదాగా, బలంగా కనిపించిన వ్యక్తులు.. డ్యాన్స్ చేస్తూ, ఆటలాడుతూ సంతోషంలో ఉన్న వాళ్లు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం (అక్టోబర్ 12) రాత్రి ఒక మహిళ చనిపోయిన తీరు దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.
పంజాబ్ బర్నాల లో 59 ఏళ్ల ఆశ రాణి అనే మహిళ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కర్వా చౌత్ (కరక చతుర్థి) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాన్స్ చేస్తూ పడిపోయింది. చుట్టూ ఉన్న వాళ్లకు పోటాపోటీగా ఆడుతూ అలాగే కూలిపోవడంతో అందరూ షాకయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
కర్వా చౌత్ సందర్భంగా ఆ మహిళ ఆ రోజు భక్తితో ఉపవాసం ఉందని.. ఎలాంటి ఆహారం తీసుకోకుండా రోజంతా వేడుకలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాప మండి బాఘ్ కాలనీలో జరిగిన ఉత్సవాలలో డ్యాన్స్ చేస్తూ ఆయాసంతో పడిపోయినట్లు చెప్పారు.
వేడుకల్లో భాగంగా ఆశరాణి తన మనుమరాలితో కలిసి ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్వహిస్తున్న వేడుకలో పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ఆడుతూ ఆడుతూ అలాగే కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని ఆమె భర్త తార్సెన్ లాల్ చెప్పాడు.
గుండె పోటు వచ్చినప్పుడు ఒక్కరే ఉంటే ఏం చేయాలి:
గుండె పోటు ఎప్పుడు వస్తుందో.. ఎవరెక్కడ కుప్పకూలుతారో తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బాధితులు ఎలా వ్యవహరించాలో డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. అవి:
- గుండె పోటు వచ్చినప్పుడు లేదా అలాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే 108 కు ఫోన్ చేయాలి
- పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి
- కంఫర్ట్ గా కూర్చోవాలి. నొప్పిగా అనిపిస్తే ఎడమవైపుగా పడుకోవాలి.
- దీంతో బ్లడ్ సర్క్యులేషన్ కాస్త నార్మల్ అవుతుంది.
- కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేయడం మంచింది
- ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా డీప్ బ్రీత్ తీసుకోవాలి
- అలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకుడదు.
- ఎలాంటి పానీయాలు కూడా తీసుకోకపోవడం మంచింది