టెంపుల్ లో బ్రాహ్మణులకు సెపరేట్​ టాయిలెట్

టెంపుల్ లో బ్రాహ్మణులకు సెపరేట్​ టాయిలెట్

ఎక్కడైనా ఆడవాళ్లు, మగవాళ్లకు సెపరేట్​ టాయిలెట్స్​ ఉంటాయి. కానీ, కేరళలోని థ్రిసూర్​లో ఉన్న కుట్టుముక్కు శివాలయంలో మాత్రం మూడో కేటగిరీతో ఓ టాయిలెట్​ కట్టింది. బ్రాహ్మణుల కోసం స్పెషల్​ టాయిలెట్​ను నిర్మించింది. దీనిపై రచ్చ జరగడంతో వెంటనే ఆ బోర్డును తొలగించేసింది. దీనిపై ఇంకో వివాదమూ రాజుకుంది. అసలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ఆ ఫొటో ఇప్పుడు తీసింది కాదని, పాతదానిని పెట్టి రచ్చ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గుళ్లో ఎవరికీ అంటరానితనం అన్న భావనే లేదని, అందరినీ సమానంగా చూస్తారని చెబుతున్నారు. ఆ మూడో టాయిలెట్​ను కేవలం గుళ్లో పనిచేసే పూజారులు మాత్రమే వాడుతుంటారని, మిగతా రెండు భక్తుల కోసమని వాదిస్తున్నారు.