డేరింగ్ లేడీ: ‘దారి తప్పిన’ బస్సుకు ఎదురునిలిచింది

డేరింగ్ లేడీ: ‘దారి తప్పిన’ బస్సుకు ఎదురునిలిచింది

ట్రాఫిక్​ రూల్స్​ పాటించట్లేదని ఇప్పటికే కేంద్రం ఫైన్లను భారీగా పెంచేసింది. జనాల నడ్డి విరుగుతుందని కొన్ని రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేయట్లేదు. దాన్నే కొందరు డ్రైవర్లు అలుసుగా తీసుకుంటున్నారు. ట్రాఫిక్​ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇదిగో అలాంటిదే ఈ ఘటన. ఓ బస్సు డ్రైవర్​ తన దారిలో కాకుండా, రాంగ్​రూట్​లో దారి తప్పి బస్సును నడిపాడు. అప్పుడు అదే రూట్​లో (కరెక్ట్​) ఓ మహిళ స్కూటీపై వస్తోంది. నాకెందుకులే అని అనుకోలే. పక్కకు తప్పుకుని పోలే. బస్సుకు ఎదురుగా బండిని ఆపింది. లెఫ్ట్​ తీసుకుని కరెక్ట్​ రూట్​లోకి బస్సు మళ్లేదాకా అలాగే చూసింది. తప్పుకోమని దారినపోయేటోళ్లు, బస్సు డ్రైవర్​ చెప్పినా వినిపించుకోలే. ముందు నువ్వు కరెక్ట్​ రూట్​లోకి మారు, అప్పుడే నేను తప్పుకునేది అంటూ రోడ్డు మధ్యలో అలాగే ఉండిపోయింది. దీంతో ఆ బస్సు డ్రైవర్​ తోక ముడవక తప్పలేదు. రూటు మార్చుకోక తప్పలేదు. రైట్​ రూట్​లో బస్సు వెళ్లాకగానీ ఆమె అక్కడి నుంచి కదల్లేదు. ఈ ఘటన కేరళలోని కాసర్​గోడ్​లో జరిగింది.