Health Alert : ఈ రకమైన కడుపు నొప్పి వస్తే.. ఇది కడుపు క్యాన్సర్ కావొచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

Health Alert : ఈ రకమైన కడుపు నొప్పి వస్తే.. ఇది కడుపు క్యాన్సర్ కావొచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ద ప్రజలు క్యాన్సర్​ బారిన పడి మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం.. 2025 నాటికి 20మిలియన్ల మంది క్యాన్సర్​ బారిన పడ్డారు. దాదాపు 1మిలియన్​ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తులు,పెద్దప్రేగు, కడుపు క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్,గర్భాశయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లుకేమియా, థైరాయిడ్ క్యాన్సర్ ,కాలేయం ,ఇంట్రాహెపాటిక్ బైల్ డక్ట్ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్లు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అయితే వీటిలో కడుపు క్యాన్సర్​ ను గుర్తించడం చాలా కష్టం..ఈ క్యాన్సర్​సంకేతాలు సాధారణ అజీర్తి సంకేతాలు గా నే కనిపిస్తాయి. ప్రారంభంలో గుర్తిస్తే ఈ క్యాన్సర్​ ను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చంటున్నారు.. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..  

కడుపు క్యాన్సర్​.. దీనిని గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ అని కూడా అంటారు. జీర్ణాశయం లోపలి పొరలో క్యాన్సర్​ కణుతులు, DNA లో మార్పులు కారణంగా అసాధారణ కణతులు పెరగడంవల్ల కడుపు క్యాన్సర్​ మొదలవుతుంది. ప్రారంభ దశలో కడుపు క్యాన్సర్‌ను గుర్తించడం పెద్ద సవాల్​ అంటున్నారు.  ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి.దీనిని సాధారణంగా సాధారణ జీర్ణ సమస్యలుగా అనుకుంటారు. 

నిరంతర అజీర్ణం, గుండెల్లో మంట..

అజీర్ణం, గుండెల్లో మంట సాధారణంగా వస్తూ ఉంటుంది అందరికి తెలిసిందే అయితే పదే పదే అజీర్ణం, గుంగెల్లో మంటల్ల వచ్చినట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే కడుపు క్యాన్సర్​ కు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయంటున్నారు.  ఎక్కువ కాలం అజీర్ణం,మంట, గ్యాస్ ట్రబుల్​ ఉన్నట్లయితే జీర్ణాయంలో పొర దెబ్బతిన్న సంకేతాలు కావొచ్చు. వ్యాధి నిర్ధారణకు ముందు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఇలాంటి లక్షణాలు ఉంటే కడుపు క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయంటున్నారు. 

 

త్వరగా కడుపు నిండినట్లు ఉండటం..

రోగులు తక్కువ మొత్తం లో ఆహారం తీసుకున్నా.. అది కడుపు నిండినట్లు అనిపించడం కడుపు క్యాన్సర్​ లక్షణమే..డాక్టర్లు దీనిని ప్రారంభ సంతృప్తత అంటారు. కడుపులో కణుతుల కారణంగా ఇలా  జరుగుతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత బొడ్డు దగ్గర వాపు కనిపిస్తుంది. కడుపు క్యాన్సర్ లక్షణాలు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) ,ఇతర జీర్ణ సమస్యలను పోలి ఉంటాయంటున్నారు డాక్టర్లు. కాబట్టి ఈ లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి.  

నిరంతరం వాంతులు, విరోచనాలు.. 

చాలామందిలో వికారం, వాంతులు సాధారణం.. ఫుడ్​ ఫాయిజన్​ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ల వల్ల వాంతులు, విరేచనాలు సంభవిస్తాయి. అయితే పదే పదే ఇలాంటి లక్షణాలుకనిపిస్తే మాత్రం డాక్టర్​ ను సంప్రదించాల్సిందే.. ఎందుకంటే కడుపు క్యాన్సర్ మొదట్లో ఈ లక్షణాన్ని చూపెడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.  

అకస్మాత్తుగా భారీగా బరువు తగ్గడం .. 

ఇతర క్యాన్సర్ల మాదిరిగా నే కడుపు క్యాన్సర్​ సోకినప్పుడు  పెద్ద ఎత్తున బరువు తగ్గుతారు. కడుపు క్యాన్సర్ ప్రారంభ దశలో ఆకలి మందగించడం.. కడుపు క్యాన్సర్ ఆకలి ,జీర్ణక్రియను నియంత్రించే జీర్ణ హార్మోన్లను డిస్ట్రబ్​ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. 

తేలికపాటి కడుపు నొప్పి.. 

కడుపు క్యాన్సర్ మొదటి సంకేతాలో మరోటి.. తేలికపాటి కడుపు నొప్పి. రోగి పై ఉదర ప్రాంతంలో నొప్పిని అనుభవిస్తారు. కడుపు క్యాన్సర్ వల్ల వచ్చే కడుపు నొప్పి ఇది వేర్వేరు ప్రదేశాల మధ్య కదులుతుంది. సాధారణంగా ఈ లక్షణాన్ని గుండెల్లో మంట, పూతల లేదా కండరాల ఒత్తిడిగా అనుకుంటారు. 

కడుపు క్యాన్సర్​ ప్రారంభ సంకేతాలు తేలికపాటి లక్షణాలుగా కనిపిస్తాయి. వీటిని చాలా మంది సాధారణ జీర్ణ సమస్యగా అనుకుంటారు. నిరంతర అజీర్ణం, ప్రారంభ తృప్తి, వికారం, వివరించలేని బరువు తగ్గడం ,కడుపు నొప్పి వంటి లక్షణాలు కొనసాగుతున్నప్పుడు డాక్టర్లను సంప్రదించాలి. ప్రారంభ దశలో కడుపు క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చు. మంచి ఫలితాలను పొందవచ్చు. కాబట్టి రోగులు ఈ లక్షణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలంటున్నారు డాక్టర్లు.