SS Karthikeya: బర్త్‌డే ట్రీట్ అదిరింది.. ప్రియాంక చోప్రాతో S.S.కార్తికేయ క్రేజీ స్టెప్పులు.. వీడియో వైరల్

SS Karthikeya: బర్త్‌డే ట్రీట్ అదిరింది.. ప్రియాంక చోప్రాతో S.S.కార్తికేయ క్రేజీ స్టెప్పులు.. వీడియో వైరల్

డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.  రాజమౌళి తెరకెక్కించే సినిమాలను ప్రమోట్ చేయడంలో కార్తికేయ ముందుంటాడు. ఇవాళ (2025 నవంబర్ 22న) ఈ యువ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయతన 34వ పుట్టిన‌రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటుగా వారణాసి చిత్ర బృందం కార్తికేయకి విషెష్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా X వేదికగా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసి విషెస్ తెలిపింది. ప్రేమికుడు’లోని సూపర్ హిట్ పాట ‘ఊర్వశి.. ఊర్వశి’ పాట‌కు కార్తికేయతో క‌లిసి సరదాగా స్టెప్పులేస్తూ, తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

" టేక్ ఇట్ ఈజీ ఫ్రెండ్..ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండు! ప్రతి పని వెనుక నిశ్శబ్దంగా నిలబడే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమా (వారణాసి) ప్రయాణంలో మీతో కలిసి డాన్స్‌ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ" ప్రియాంక చోప్రా తన ట్వీట్ లో రాసుకోచ్చింది. ఈ క్రమంలో నెటిజన్లు సైతం కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'పుట్టినరోజు వైబ్స్ ఇంత ఆరోగ్యకరంగా ఉంటే, సినిమా ఖచ్చితంగా బంగారంలా ఉండబోతుంది. లెజెండ్స్, డ్యాన్స్ చేస్తూ ఉండండి' అని కామెంట్స్ పెడుతున్నారు. 

ఎస్.ఎస్. కార్తికేయ.. "ఈగ, "బాహుబలి: ది బిగినింగ్", బాహుబలి 2: ది కన్‌క్లూజన్, 'RRR' సినిమాలకు పనిచేశాడు. 'RRR' సినిమాకు ఆస్కార్ క్యాంపెయిన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'ప్రేమలు' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం ఆర్కా మీడియా వర్క్స్‌తో కలిసి రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ల కోసం పనిచేస్తున్నారు. సిద్ధార్థ్‌ నాదెళ్ల డెబ్యూ డైరెక్టర్ గా ఫహద్ ఫాజిల్ హీరోగా ‘ఆక్సిజన్‌’ (OXYGEN) పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. మరొకటి శశాంక్‌ యేలేటి డైరెక్షన్లో ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ (Dont Trouble The Trouble) తెరకెక్కుతుంది. ఫన్‌, థ్రిల్‌, ఎమోషన్స్‌తో మూవీ ఉండనుంది. 

►ALSO READ | Champion CHANDRAKALA Glimpse: ఆసక్తిగా చంద్రకళ గ్లింప్స్ & రామ్ మిరియాల గొంతుతో ‘ఛాంపియన్’ ఫస్ట్ సింగిల్

ఇకపోతే వారణాసి మూవీలో మహేష్ బాబు రుద్రగా కనిపించబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ', ప్రియాంక చోప్రా 'మందాకినీ'గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సంచారి సాంగ్, టైటిల్ గ్లింప్స్‌ గ్లోబల్ ట్రెండింగ్ అయింది. వారణాసి మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎస్ ఎస్ కార్తికేయ వ్యవహరిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. మూవీ 2027 వేసవిలో విడుదల కానుంది.