రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోకి కేశవ్ మహారాజ్ రాయల్ ఎంట్రీ..

రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోకి కేశవ్ మహారాజ్ రాయల్ ఎంట్రీ..

రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోకి కేశవ్ మహారాజ్ ఎంట్రీ ఇచ్చాడు. గాయాలపాలైన రాజస్థాన్ ప్లేయర్ స్థానంలో రీప్లేస్మెంట్ గా వచ్చాడు ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ స్పిన్నర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మహారాజ్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఒక ఆసక్తికర వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో మహారాజ్ " నమస్తే, రాయల్ గా ఉండటం మహారాజ్ కే సాధ్యమవుతుంది" అంటూ పింక్ బ్లేజర్ లో టర్బన్ తో మెరిసాడు.

34ఏళ్ళ ఈ స్పిన్ బౌలర్ కు T20ల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సౌతాఫ్రికా తరఫున 27 T20 మ్యాచులు ఆడిన మహారాజ్ 7.38 ఎకనామితో 24 వికెట్లను పడగొట్టాడు. రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో, 0.800 నెట్ రన్ రేట్ తో టేబుల్లో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ టీమ్ కి మహారాజ్ ఎంట్రీ మరింత బలాన్ని ఇస్తుందనే చెప్పాలి.