బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నకేజీఎఫ్-2

బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నకేజీఎఫ్-2

కేజీఎఫ్ సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.ఇండియన్ ఇండస్ట్రీలోనే ఒక సంచలనం. చిన్న ప్రాజెక్ట్ గా మొదలై ఫస్ట్ పార్ట్ కు అందరి దృష్టిని ఆకర్షించింది.సెకండ్ పార్ట్ కు దేశమంతటా అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి.అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ,యశ్ లు మాస్ కంటెంట్ ఇచ్చి అందరినీ మెస్మరైజ్ చేశారు. యాక్షన్ సినిమాలు ఇలా కూడా తీయోచ్చా అని టాప్ డైరెక్టర్లంతా షాక్ అయ్యేలా సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు.

ఈ మూవీ కలెక్షన్ల విషయానికొస్తే ట్రేడ్ పండితుల అంచనాలు తలక్రిందులు చేస్తూ మొదటి వారం లో 650 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.రెండు వారాలలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కేవలం హిందీలోనే ఇప్పటివరకు 353 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.తెలుగులో నే 75 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.ఇప్పటివరకు వెయ్యికోట్లకు పైగా కలెక్ట్ చేసి కేజీఎఫ్-2 దేశంలోనే అత్యధిక వసూళ్ల సినిమాల లిస్టులో 4వ స్థానంలో నిలిచింది.కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీకే కాదు సౌత్ ఇండస్ట్రీకే గర్వకారణం అని చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం

స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి