
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కోలాహలంగా సాగుతుంది. లక్షలాది మంది భక్తులు జై జై గణేషా.. బై బై గణేషా అంటూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. ఉదయం 6.30గంటలకు ప్రారంభమైన బడా గణేషుడు లక్షలాది మంది భక్తుల పరివారంతో నగర వీధుల్లో ఊరేగుతూ టెలిఫోన్ భవన్- ఇక్బాల్ మినార్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సచివాలయం దగ్గరకు చేరుకుంది.
తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు ఖైరతాబాద్ గణేశుడు చేరుకోనుంది. మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 1.30 గం.కు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. బడా గణేషుడి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై బాహుబలి క్రేన్ పాయింట్ 4నంబర్ క్రేన్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు.
బడాగణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. గణనాథుడిపైకి పూలు చల్లుతూ, డోలు వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు భక్తులు. మరోవైపు భద్రత దృష్ట్యా ఖైరతాబాద్ గణేశుడి వాహనం చుట్టూ రోప్‌పార్టీ ఏర్పాటు చేశారు పోలీసులు.