కెనడాలో ఖలిస్తాన్ నేత ​హర్దీప్​సింగ్ కాల్చివేత

కెనడాలో ఖలిస్తాన్ నేత ​హర్దీప్​సింగ్ కాల్చివేత

న్యూఢిల్లీ: ఖలిస్తాన్​ టైగర్​ ఫోర్స్(కేటీఎఫ్​) చీఫ్​హర్దీప్​సింగ్​ నిజ్జర్​ కెనడాలో హత్యకు గురయ్యాడు. పంజాబ్​లోని జలంధర్​బర్సింగ్​పూర్ గ్రామానికి చెందిన నిజ్జర్​ కెనడాలో నివసిస్తున్నాడు. మన దేశంలో జరిగిన పలు టెర్రర్ దాడుల్లో నిజ్జర్ ప్రమేయం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్​ఐఏ) పేర్కొంది. 2021లో జలంధర్ లో ఓ పూజారిపై దాడి కేసుతో పాటు టెర్రర్ దాడులకు సంబంధించిన కేసుల్లో  నిజ్జర్ కోసం ఎన్ ఐఏ అధికారులు వెతుకుతున్నారు. నిజ్జర్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చారు. నిజ్జర్​ను పట్టిచ్చినా.. అతడి ఆచూకీ గురించి తెలిపినా రూ.10 లక్షలు బహుమానంగా అందిస్తామని ఎన్​ఐఏ ప్రకటించింది.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిజ్జర్ కెనడా పారిపోయాడు. కొంతకాలంగా అక్కడే ఉంటున్న నిజ్జర్.. తాజాగా గురుద్వార బయట పార్క్ చేసిన కారులో శవమై కనిపించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:27 సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్​పై కాల్పులు జరిపారు. దీంతో అతడు స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయాడు. నిజ్జర్​ డెడ్​బాడీని తరలించే సమయంలో  కొంతమంది ఖలిస్తాన్​కు అనుకూలంగా, భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.