ప్రారంభమైన నెలకే కూలిన ఖమ్మం బస్టాండ్ సీలింగ్

ప్రారంభమైన నెలకే కూలిన ఖమ్మం బస్టాండ్ సీలింగ్

రాష్ట్రంలోనే అత్యంత సుందరంగా, ఆధునికంగా, రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ బస్టాండ్ నిర్మాణ పనులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్‌కు ముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ బస్టాండ్‌ను ఏప్రిల్ 4న ఘనంగా ప్రారంభించారు. అయితే బస్టాండ్ ప్రారంభమై నెలదాటిందో లేదో అప్పుడే కూలడం మొదలైంది. ఎంతో గొప్పగా నిర్మించిన ఈ బస్టాండ్‌లో బుధవారం ఉదయం సీలింగ్ ఊడిపడింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో బస్టాండ్‌లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కాగా.. బస్టాండ్ ప్రారంభించిన నెల రోజులకే ఇలా జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులు లేరు కాబట్టి సరిపోయింది కానీ, ఎవరి ప్రాణాలైనా పోతే బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.