సీఎంఆర్ లక్ష్యం త్వరగా పూర్తి చేయాలి : గౌతమ్

సీఎంఆర్ లక్ష్యం త్వరగా పూర్తి చేయాలి : గౌతమ్

ఖమ్మం టౌన్/నేలకొండపల్లి, వెలుగు :  సీఎంఆర్(కస్టం మిల్లింగ్  రైస్) దిగుమతి లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గురువారం నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వలు ఉన్నది, హమాలీల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

జూన్ నాటికి లక్ష్యం మేర పూర్తిగా సీఎంఆర్ రైస్ అందించాలన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, నేలకొండపల్లి తహసీల్దార్ గౌరీశంకర్, రైస్ మిల్ మేనేజింగ్ సంతోష్ ఉన్నారు. 

ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

ధరణి ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా, పెండింగ్ దరఖాస్తులను నెలాఖరులోపు  పరిష్కరించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల ధరణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు.  ఖమ్మం రూరల్ మండలంలో టీఎం33, మ్యూటేషన్ తదితర అన్ని రకాల దరఖాస్తులను కలుపుకొని ధరణి లో 176 దరఖాస్తులు, 10 రిజిస్ట్రేషన్ స్లాట్లు, ఖమ్మం అర్బన్ మండలంలో ధరణికి సంబంధించి 171, రిజిస్ట్రేషన్ స్లాట్లు 10 పెండింగ్ లో ఉన్నట్లు  తెలిపారు. రూరల్ మండలంలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్న 42, అర్బన్ మండలంలో 30 పీవోబీ దరఖాస్తుల ఫైళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల తహసీల్దార్లు పి. రాంప్రసాద్, సీహెచ్ స్వామి, సిబ్బంది ఉన్నారు.