తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి : గౌతమ్

తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం రాత్రి సుబ్లేడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంత విధుల్లో ఉన్నారు, ఎన్ని వాహనాలు తనిఖీ చేశారు లాంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడ్స్ వెహికల్స్​ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అందుకు రిజిస్టర్​ను నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాప్ లను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రక్కనే ఉన్న బానోత్ మంగీలాల్ షాపును తనిఖీ చేశారు. షాపులో మద్యం సీసాలను గుర్తించారు. వెంటనే ఆ షాప్​ను సీజ్​చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఆయన వెంట పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి, ఎస్డీసీ రాజేశ్వరి, సీఐ జితేందర్ రెడ్డి, ఖమ్మం రూరల్ తహసీల్దార్ పివి. రామకృష్ణ, ఎన్నికల డీటీ రవీందర్, ఆర్ఐ వీరయ్య ఉన్నారు.