పాత కక్షలతో.. సూరంపల్లి సర్పంచ్పై కత్తితో దాడి

పాత కక్షలతో.. సూరంపల్లి సర్పంచ్పై కత్తితో దాడి

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరంపల్లి సర్పంచ్ రామారావు పై నిన్న రాత్రి(ఫిబ్రవరి 28) కత్తితో దాడి చేశారు. ఇంటి నుంచి బయట వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. పాత కక్షలతోనే తనపై దాడి చేయించారని తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న రామారావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.