ఖమ్మం జిల్లాలోని టేకులపల్లిలో జులై 31న జాబ్ మేళా : ఎన్. మాధవి

ఖమ్మం జిల్లాలోని టేకులపల్లిలో జులై 31న జాబ్ మేళా : ఎన్. మాధవి

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 31న ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్  టేకులపల్లిలో  జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

20 నుంచి 35 సంవత్సరాలు కలిగి, ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న యువకులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.