వరద ముప్పు ప్రాంతాలను గుర్తించండి : ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య

వరద ముప్పు ప్రాంతాలను గుర్తించండి : ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో వరద ముప్పు పొంచివుండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. కార్పొరేషన్​ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది వరదల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈసారి మరింత మెరుగైన ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.

వరద ముప్పు ప్రాంతాలున్న ప్రతీ డివిజన్​కు ప్రత్యేకంగా ఇన్​చార్జి ఆఫీసర్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. వారితోపాటు వార్డ్ ఆఫీసర్, శానిటరీ సూపర్​వైజర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించాలన్నారు. వారంలోగా ఈ గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని సూచించారు. వరదల సమయంలో ప్రజలకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మున్సిపల్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.