భట్టి విక్రమార్క దళిత దొర : లింగాల కమల్​రాజు

భట్టి విక్రమార్క దళిత దొర : లింగాల కమల్​రాజు
  •     మంత్రి హరీశ్​రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదు
  •     ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్​రాజు కామెంట్

ముదిగొండ, వెలుగు : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి హరీశ్​రావు, కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఫైర్​అయ్యారు. శుక్రవారం ముదిగొండలోని బీఆర్ఎస్​లీడర్​మందారపు ఎర్ర వెంకన్న ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, హరీశ్​రావును తిడితే పెద్ద లీడర్​ను అవుతానని భట్టి విక్రమార్క అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మధిరలో భట్టి పాదయాత్రకు పట్టుమని 10 మంది రాలేదని విమర్శించారు.

ALSO READ: టికెట్ రాలేదని నాకేం బాధలేదు : లావుడియా రాములు నాయక్

జిల్లాలో దొర ఎవరైనా ఉన్నారంటే అది దళిత దొర భట్టి విక్రమార్కనే అన్నారు. మధిరలో 100 పడకల హాస్పిటల్​ఏర్పాటు చేయాలని ఎప్పుడైనా అడిగివా అని ప్రశ్నించారు. కమల్​రాజు వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, మండల కార్యదర్శి గడ్డం వెంకట్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోట్ల ప్రసాద్ తదితరులు ఉన్నారు.