అప్పటి వరకు నేను సింగిల్‌‌‌‌గా ఉన్నట్టే లెక్క

అప్పటి వరకు నేను సింగిల్‌‌‌‌గా ఉన్నట్టే లెక్క

సినిమా ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే అందరి కళ్లూ సినిమా వాళ్లమీదే ఉంటాయి మరి. ఇక బాలీవుడ్‌‌‌‌లో అయితే సెలెబ్రిటీ రిలేషన్‌‌‌‌షిప్స్‌‌‌‌ పెద్ద టాపిక్. ఇప్పటికే కొందరు హీరో హీరోయిన్లు ప్రేమించుకుని పెళ్లిళ్లు  చేసుకున్నారు. రీసెంట్‌‌‌‌గా ఆలియా, రణ్‌‌‌‌బీర్ కపూర్‌‌‌‌‌‌‌‌ కూడా ఒక్కటయ్యారు. త్వరలో రకుల్‌‌‌‌ కూడా నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడబోతోంది. ఇక మిగిలింది సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీయే అంటున్నారు ఫ్యాన్స్. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. కొందరైతే వాళ్లు ఇప్పటికే రిలేషన్‌‌‌‌లో ఉన్నారని కూడా అంటున్నారు. దాంతో రీసెంట్‌‌‌‌గా కియారా రియాక్టయ్యింది. ‘నా పెళ్లి వార్త నాకు నేనుగా చెప్పేవరకు నేను సింగిల్‌‌‌‌గా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ టాపిక్ వదిలేయండి. అందరూ అనుకుంటున్నట్టు నాకు పెళ్లయిపోలేదు. ఇంకా సింగిలే’ అని చెప్పిందామె. అయితే ఆలియా పెళ్లి తర్వాత కియారా, సిద్ధార్థల గురించి నెటిజన్స్ కామెంట్ చేయడం మరింత ఎక్కువయ్యింది. కియారాని త్వరగా పెళ్లి చేసుకో అంటూ సిద్ధార్థ్‌‌‌‌ను ఉద్దేశించి మెసేజుల మీద మెసేజులు పెడుతున్నారు. ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వు కియారా అని ఆమె అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కియారా ఇవేమీ పట్టించుకోకుండా రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌తో కలిసి శంకర్‌‌‌‌‌‌‌‌ సినిమా షూట్‌‌‌‌లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమృత్‌‌‌‌సర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతోంది. పలు లొకేషన్స్‌‌‌‌లో ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారు. దీనితో పాటు భూల్ భులయ్యా, గోవిందా నామ్‌‌‌‌ మేరా, జుగ్‌‌‌‌ జుగ్ జియో చిత్రాల్లోనూ నటిస్తోంది కియారా.