కోమాలోకి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

కోమాలోకి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కోమాలో ఉండడంతో  ఆ దేశ అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు సహాయకుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ గూఢచర్య వర్గాలు తెలిపాయని చెప్పారు.

కిమ్ కోమాలో ఉన్నట్టు తెలుస్తోందని… కానీ ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది కిమ్ బయట చాలా తక్కువసార్లు కనిపించారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ తెలిపారు. కిమ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత కిమ్ ఓసారి బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఇప్పుడు మళ్లీ  అలాంటి వార్తలే కిమ్ పై వస్తున్నాయి.