థియేట‌ర్లో కిర‌ణ్ దుమ్మురేపే డ్యాన్స్: ‘అన్నా నువ్వు మావోనివే.. హిట్ కొట్టేసావు’.. కె ర్యాంప్ కలెక్షన్స్ ఎంతంటే?

థియేట‌ర్లో కిర‌ణ్ దుమ్మురేపే డ్యాన్స్: ‘అన్నా నువ్వు మావోనివే.. హిట్ కొట్టేసావు’.. కె ర్యాంప్ కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ (K-Ramp) డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటుంది.ఈ క్రమంలో క్రమ క్రమంగా కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. ఫస్ట్ డే (అక్టోబర్18న) రూ.2.15 కోట్లకు పైగా నెట్ వసూలు చేయగా.. రెండో రోజు ఆదివారం రూ.2.85కోట్లు సాధించింది. ఇలా K-Ramp రెండ్రోజుల్లో ఇండియాలో రూ.5.1కోట్ల నెట్ కల్లెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం దృష్ట్యా.. మొదటిరోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసి కె ర్యాంప్ పరుగులు తీస్తోంది. ఆదివారం అక్టోబర్ 19న మొత్తం తెలుగు ప్రేక్షకుల నుండి 45.84% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఉదయం షోలలో 25.33% ఆక్యుపెన్సీ నమోదవ్వగా.. ఇది మధ్యాహ్నం నాటికి గణనీయంగా పెరిగి 50.05%కి చేరుకుంది. సాయంత్రం సమయంలో 50.16% నుంచి రాత్రి షోలలో 57.82%కి బలంగా పెరిగింది. 

ఇవాళ (అక్టోబర్20న) దీపావళి హాలిడే కావడంతో, వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఈ సినిమా వారపు రోజుల్లో బలమైన వసూళ్లను సాధించి, డీసెంట్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా 2 రోజుల్లో దాదాపు రూ.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో మూవీ కేవలం 2 రోజుల్లోనే 50% రికవరీని సాధించి, బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తోంది. ఇకపోతే.. కె ర్యాంప్ రెండ్రోజుల బాక్సాఫీస్ గ్రాస్ ఎంతనేది మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఈ సందర్భంగా మూవీ సక్సెస్ను ఆడియన్స్తో సెలబ్రేట్ చేసుకునేందుకు కిరణ్ నడుం బిగించాడు. వరుసబెట్టి థియేటర్లను విజిట్ చేస్తూ.. ఫ్యాన్స్తో హంగామా మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా కిరణ్ ఓ థియేటర్కి వెళ్లి కె ర్యాంప్ పాటకు దుమ్మురేపే డ్యాన్స్ చేశాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోని కిరణ్ ఇంస్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ఆడియన్స్కు థ్యాంక్స్ తెలిపాడు. ‘‘మీరు ఇచ్చిన సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకుంటుంటే’’ అని ఫైర్ ఎమోజీలు పెట్టాడు.

‘‘వేరే లెవల్ ఫీలింగ్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ’’ అని క్యాప్షన్తో ఈ వీడియోను పంచుకున్నారు. ‘అన్నా నువ్వు మావోనివే.. హిట్ కొట్టేసావు.. అది చాలా హ్యాపీ ఫీలింగ్’ అని తమ ప్రేమం కామెంట్ల ద్వారా రియాక్ట్ అవుతున్నారు.