K-Ramp Collections: మిక్సెడ్ టాక్ వచ్చిన, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. K ర్యాంప్ బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలివే

K-Ramp Collections: మిక్సెడ్ టాక్ వచ్చిన, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. K ర్యాంప్ బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలివే

దీపావళికి (అక్టోబర్ 18న) రిలీజైన K ర్యాంప్ మూవీ సూపర్ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. ఫస్ట్ డే మిక్సెడ్ టాక్తో అందుకున్న ఈ మూవీ, రెండో రోజు నుంచి క్రమంగా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. మొదటి రోజును మించిన వసూళ్లు రెండో రోజు, రెండో రోజును మించి మూడో రోజు K ర్యాంప్ హవా కొనసాగిస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.17.5 కొట్ల గ్రాస్ సాధించింది. అంతేకాకుండా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి కిరణ్ సత్తా ఏంటో నిరూపించింది. ఈ విషయాన్ని K ర్యాంప్ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

కె-రాంప్ బడ్జెట్:

నటీనటుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్, మార్కెటింగ్, థియేట్రికల్ ఖర్చులతో కలిపి "కే ర్యాంప్" మొత్తం బడ్జెట్ రూ. 4 కోట్లు దాటింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.8.15 కోట్ల జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. 

ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ: రూ. 6.25 కోట్లు

కర్ణాటక + మిగిలిన భారతదేశం: 0.6 కోట్లు

ఓవర్సీస్: 1.5 కోట్లు

ఇలా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం: K ర్యాంప్ లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.8.5 కోట్లకి పైగా షేర్, సుమారు రూ.17.5 కోట్లకి పైగా  గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇపుడు ఈ మూవీ మూడ్రోజుల్లోనే రూ.17.5 కొట్ల గ్రాస్ వసూళ్లు చేసి.. బ్రేక్ ఈవెన్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. 

K ర్యాంప్ నెట్ బాక్సాఫీస్:

సాక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం, కె-రాంప్' ఇండియా వైడ్ గా తొలి రోజు శనివారం (అక్టోబర్ 18న) రూ.2.15 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. రెండో రోజు ఆదివారం రూ. 2.85 కోట్లు సాధించగా.. మూడో రోజు సోమవారం దీపావళి రోజున రూ.2.33 కోట్ల నెట్ చేసింది. మొదటి రోజు కంటే, మూడో రోజు ఎక్కువ వసూళ్లు చేయడం విశేషం. ఇలా K ర్యాంప్ మూడ్రోజుల ఇండియా బాక్సాఫీస్ చూసుకుంటే.. రూ.7.43 కోట్ల నెట్ వసూళ్లు సాధించి కొనసాగుతుంది. ఇక ఈ వారం మొత్తం కిరణ్ ర్యాంప్ లెక్కలో ఎన్ని కోట్లు చేరుతాయో చూడాలి!!