సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి విమర్శలు తగవు : హర్షవర్ధన్ రెడ్డి

సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి విమర్శలు తగవు : హర్షవర్ధన్  రెడ్డి
  •     ప్రజా సమస్యలపై రేవంత్  నిరంతరం పోరాడారు
  •     పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి

పాలమూరు, వెలుగు :  ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్  రెడ్డి విమర్శలు చేయడం తగదని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్  రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తన రాజకీయ జీవితం అంతా ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర రేవంత్  రెడ్డిదని ఆయన పేర్కొన్నారు. కిషన్  రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఒక సింబల్ పై గెలవలేదని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని గెలిచారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికై రెండు సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని  రేవంత్  రెడ్డి అధికారంలో తెచ్చారని ఆయన గుర్తుచేశారు. 

కాళశ్వరం ప్రాజెక్టు పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కిషన్ రెడ్డి అడగడం విడ్డూరంగా ఉందని,  గతంలో అనేక సార్లు రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వాదం ముందుకు తెచ్చి బీసీ అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకోలేకపోయారని అన్నారు.